ఏ మనిషి జీవితంలో ఎదగాలి అన్నా విద్య అవసరం ఎంతైనా ఉంటుంది. విద్యను అభ్యసించిన మనిషి పెద్దయ్యాక ఉన్నతంగా ఎదుగుతారు అనడంలో సందేహం అవసరం లేదు. ఇక పాఠశాల విద్యావిధానం మనదేశంలో ఎలా ఉన్నదో చెప్పాల్సిన అవసరం లేదు. కరోనాకు ముందు దేశంలో కొత్త విద్యావిధానాన్ని తీసుకొచ్చారు. వివిధ దేశాల్లో వివిధ రాకాల విద్యావిధానాలు అమలులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సింగపూర్: సింగపూర్ లో మూడు రకాల విద్యావిధానాలు అమలులో ఉన్నాయి. ఆరేళ్లు ప్రైమరి, నాలుగేళ్లు సెకండరీ, మూడేళ్లు పోస్ట్ సెకండరీ విద్యావిధానం అమలులో ఉన్నది. నాలుగేళ్లు ప్రాథమిక విద్యావిధానం అమలులో ఉంటుంది. మొదటి నాలుగేళ్లలో పాఠశాలలు పరీక్షలు నిర్వహిస్తాయి. విద్యార్థులు ఏ సబ్జెట్‌లో రాణిస్తున్నారో గుర్తించి వారిని పైచదువులకు అనుమతిస్తారు.
Read: జంతువుల్లో మళ్లీ కరోనా కలకలం: నాలుగు సింహాలకు పాజిటివ్…
శాన్ మారియో: 40 వేల మంది జనాభా కలిగిన చిన్న దేశం శాన్ మారియో. అక్కడ ప్రతి ఆరుగురు విద్యార్థులకు ఒక టీచర్ ఉంటారు. శాన్ మారియోలో 5+3+3 విద్యావిధానం అమలులో ఉన్నది.
చైనా: చైనాలో పాఠశాల విద్య మూడు భాగాలుగా ఉంటుంది. ప్రీస్కూల్ మూడేళ్లు, ప్రైమరీ స్కూల్ ఆరేళ్లు, సెకండరీ విద్య ఆరేళ్లు ఉంటుంది.
దక్షిణ కొరియా: దక్షిణ కోరియాలో 6+3+3 విద్యావిధానం అమలులో ఉంటుంది. దక్షిణ కొరియాలో విద్యను అభ్యసించేందుకు విద్యార్థులు పోటీపడుతుంటారు. అర్థరాత్రి సమయం వరకు కష్టపడి చదువుతుంటారు.
జపాన్: జపాన్‌లో 6+3+3 విద్యావిధానం అమలు చేస్తారు. స్కూల్స్‌లో పిల్లలకు ఆయాలు ఉండరు. పిల్లలే స్కూల్స్ ను శుభ్రం చేసుకుంటారు. ఇక స్కూల్స్ లో జపనీస్ కాలిగ్రఫీతో పాటుగా లిటరేచర్‌ను తప్పనిసరిగా బోధిస్తారు.
