NTV Telugu Site icon

స్కూల్ ను మ‌ధ్య‌లో వ‌దిలేశాడు… కోట్ల రూపాయ‌లు సంపాదించాడు…

బాగా చ‌దువుకుంటే మంచి ఉద్యోగం సంపాదించ‌వ‌చ్చు.  లైఫ్‌లో రిస్క్ లేకుండా జీవించ‌వ‌చ్చు.  చ‌దువుకున్న అందరికీ మంచి ఉద్యోగాలు వ‌స్తున్నాయా అంటే లేదని చెప్పాలి.  వ‌చ్చిన ఉద్యోగాల‌తో ప్ర‌స్తుతం ఉన్న లైఫ్ ను లీడ్ చేయ‌గ‌ల‌మా అంటే చెప్ప‌లేము.  మ‌ధ్య‌లో క‌రోనా లాంటి మ‌హ‌మ్మారులు వ‌స్తే ప‌రిస్థితులు ఎలా ఉంటాయో చెప్ప‌లేము.  కొంత‌మంది పిల్ల‌లు చ‌దువులో వెన‌క‌బ‌డి ఉంటారు.  కొంద‌రు చ‌దువును మ‌ద్య‌లో వ‌దిలేసి ఉంటారు.  అలాంటి వారిలో కొంద‌రు ప్ర‌పంచాన్ని ఏలిన వాళ్లు కోక‌ల్లుగా ఉన్నారు.  అలాంటి వారిలో ఒక‌రు యూకేలోని యోర్క్‌షైర్‌కు చెందిన స్టీవ్ పార్కిన్‌.

Read: ప్ర‌తిరోజూ శృంగారం… ఆరోగ్యానికి వ‌రం…

16 ఏళ్ల‌కే చ‌దువును ప‌క్క‌న పెట్టిన హెవీ గూడ్స్ వెహికిల్ లైసెన్స్ సంపాదించి డ్రైవ‌ర్‌గా ప‌నిచేయ‌డం మొద‌లుపెట్టారు.  బ‌ట్ట‌ల కంపెనీలో వెహికిల్ డ్రైవ‌ర్‌గా ప‌నిచేశాడు.  అలా అనేక కంపెనీల‌లో ప‌నిచేసి అనుభ‌వం గ‌డించిన స్టీవ్ క్లిప్ప‌ర్ అనే లాజిస్టిక్ కంపెనీని ప్రారంభించాడు.  డ్రైవ‌ర్‌గా ప‌నిచేసిన స‌మ‌యంలో ఉన్న ప‌రిచ‌యాల‌తో కంపెనీకి ఆర్డ‌ర్లు తెచ్చుకొని కంపెనీని వృద్ధిలోకి తీసుకొచ్చాడు.  క‌రోనా స‌మ‌యంలో ఇళ్ల‌ల్లో చిక్కుకుపోయి ప్ర‌జ‌ల కోసం వ‌స్తువుల‌ను పంపి ప్ర‌జ‌ల మ‌న్న‌ల‌ను పొందాడు.  దీంతో కంపెనీ ట‌ర్నోవ‌ర్ 39.1 శాతం పెరిగింది.  కంపెనీ విలువ 700 మిలియ‌న్ పౌండ్ల‌కు చేరింది.  ప్ర‌స్తుతం క్లిప్ప‌ర్ కంపెనీలో సుమారు 10 వేల మంది ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు.