ప్ర‌తిరోజూ శృంగారం… ఆరోగ్యానికి వ‌రం…

సృష్టికి మూలం శృంగారం.  ప్ర‌తి జీవీ త‌న సంతానాన్ని ఉత్ప‌త్తి చేయ‌డ‌మే శృంగారం యెక్క ముఖ్య ఉద్దేశం.  అయితే, ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో శృంగారం అన్న‌ది మొక్కుబ‌డిగా మారిపోయింది.  తీరిక‌లేనంత బిజీగా మారిపోతున్న ప్ర‌జ‌లు శృంగారానికి ఒక‌రోజు అంటున్నారు.  కొంత‌మందైతే ఆ రోజుకూడా వ‌దిలేస్తున్నారు.  గుర్తొచ్చిపుడు మ‌మా అనిపించి వ‌దిలేస్తున్నారు.  శృంగారం అన్న‌ది ఆరోగ్యానికి సంబంధించిన‌ది.   మ‌నిషి ఆనందంగా ఉన్న‌ప్పుడు శ‌రీరంలో హ‌ర్మోన్లు విడుద‌ల‌వుతుంటాయి.  ఈ హార్మోన్లు మ‌నిషిని ముందుకు న‌డిపేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంటాయి.  ప్ర‌తిరోజూ శృంగారంలో పాల్గొనడం వ‌ల‌న ఎలాంటి ఆరోగ్యం ల‌భిస్తుంది అనే విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.  

Read: టీజర్ : రక్షించాల్సిన దేవుడే రాక్షసుడైతే… !

ప్ర‌తిరోజూ శృంగారంలో పాల్గొన‌డం వ‌ల‌న ఒత్తిడి దూర‌మైతుంది.  ఫ‌లితంగా మెద‌డు చురుగ్గా ప‌నిచేస్తుంది.  రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.  శ‌రీరంలో వివిధ రకాల చెడు వైర‌స్‌ల‌ను, బ్యాక్టీరియాల‌ను ఎదుర్కొన‌డంలో శృంగారం ఉప‌యోగ‌ప‌డుతుంది. శృంగారం వ‌ల‌న మ‌హిళ‌ల్లో శ‌రీర కండ‌రాలు బ‌లంగా త‌యార‌వుతాయి.  గుండెపోటు వ‌చ్చే రిస్క్ కూడా త‌గ్గిపోతుంది.  శృంగారం వ‌ల‌న శ‌రీరంలో ఈస్ట్రోజ‌న్‌, టెస్టోస్టిరాన్ హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి.  అంతేకాదు ప్ర‌తిరోజూ శృంగారంలో పాల్గొనే వ్య‌క్తుల్లో ఆత్మ‌విశ్వాసం పెరుగుతుంది.  ఏ ప‌నినైనా చేయ‌గ‌ల‌మ‌నే కాన్ఫిడెన్స్ క‌లుగుతుంది.  నిద్ర‌లేమి స‌మ‌స్య‌నుంచి బ‌య‌ట‌పడొచ్చు.  ఒక్క మాట‌లో చెప్పాలంటే శృంగారం శారీర‌క‌, మాన‌సిక ఆరోగ్యానికి ఒక టానిక్ లాంటిది.  

Related Articles

Latest Articles