తెలంగాణలోని మద్యం దుకాణాల టెండర్లకు షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. మద్యం దుకాణాలకు టెండర్లు వేయదలచిన వారు ఈ నెల 10 నుంచి 18 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించింది. నాన్ రిఫండబుల్ అమౌంట్ రూ.2 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 20వ తేదీన మద్యం షాపుల లాటరీ తీయనున్నట్లు ప్రకటించింది.
అయితే గత 2019 నిర్వహించిన లాటరీలో మద్యం షాపులు వచ్చినవారి గడువు అక్టోబర్‌తో ముగిసింది. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం దుకాణాలకు ఒక నెల రోజులు గడువు పొడిగించింది. మద్యం షాపుల్లో కూడా రిజర్వేషన్లు చేస్తామని ప్రకటించినా ఇప్పటికీ దానిపై స్పష్టత లేదు.