విడాకులపై అధికారిక ప్రకటన చేసిన నాగచైతన్య, సమంత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని మాసాలుగా నాగా చైతన్య, సమంత విడాకులకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో పాటు ప్రధాన వార్తా పత్రికల్లోనూ విశేషంగా చోటు చేసుకుంటున్నాయి. అయితే… ఈ మొత్తం వ్యవహారంలో నాగచైతన్య వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వచ్చాడు. సమంత మాత్రం సందర్భాను సారంగా అవుననో, కాదనో ఏదో ఒక రీతిలో హింట్ ఇస్తూ వస్తోంది. ఆమె నెట్ ఫ్లిక్స్ లో నటించబోతున్న ‘డైవోర్స్’ అనే వెబ్ సీరిస్ ప్రమోషన్ కోసమే సమంత ఇలాంటి ప్రచారాలు చేస్తోందనే వార్తలూ వచ్చాయి. కానీ సమంత సన్నిహితుల నుండి వచ్చిన సమాచారం ప్రకారం వారు ఇప్పటికే మ్యూచువల్ అండర్ స్టాండింగ్ లో విడాకులకు అప్లయ్ చేశారట. కోర్టు నుండి ఆదేశాలు రావడమే తరువాయి అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సమంతకు భరణంగా నాగార్జున ఫ్యామిలీ 200 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడిందని, ఆ ఆఫర్ ను సమంత సున్నితంగా తిరస్కరించిందనే పుకార్లూ వినిపించాయి. అయితే ఇవాళ నాగచైతన్య పోస్ట్ చేసిన ట్వీట్ ఈ పుకార్లన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేసింది.
విడాకులపై పెదవి విప్పిన చైతు
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్‌కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
విడాకులు విషయంలో కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి నాగచైతన్య తెర దించేశాడు. శనివారం మధ్యాహ్నం నాగచైతన్య తన విడాకుల వార్త నిజమేనంటూ ట్వీట్ చేశాడు. భార్యాభర్తలుగా తమ బంధాన్ని ఇక మీదట కొనసాగించడం లేదని పేర్కొన్నాడు. దశాబ్దానికి పైగా తమ మధ్య ఏర్పడిన స్నేహబంధం గొప్పదని తెలిపాడు. మొత్తం మీద నాగచైతన్య తొలిసారి తమ విడాకుల గురించి మీడియా ముందుకు రావడంతో ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టు అయ్యింది. విశేషం ఏమంటే… నాగచైతన్య పెట్టిన ప్రెస్ నోట్ నే సమంత పేరు మార్చి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. సో… వీరిద్దరి మధ్య ఇప్పటి వరకూ అండర్ స్టాండింగ్ అయితే బాగానే ఉంది. మరి రాబోయే రోజుల్లో ఈ స్నేహబంధాన్ని ఇలానే కొనసాగిస్తారో లేదో చూడాలి.
Read Also: ఆ హీరో, హీరోయిన్లు విడిపోతే భరణం ఉండదా!?
తాజావార్తలు
-
Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
-
Vastu Tips: ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశం వాస్తు ప్రకారం ఎలా ఉండాలి? చాలామందికి తెలియని విషయాలు ఇవే!
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!