NTV Telugu Site icon

ఢిల్లీ నుంచి బయలుదేరిన సాయితేజ పార్ధీవదేహం

sai teja soldier

గత బుధవారం సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ భార్య మధులికతో సహా 13 మంది తమిళనాడులోని కూనూర్‌ లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించి సంగతి తెలిసిందే. అయితే నిన్న బిపిన్‌ రావత్‌, మధులికల అంత్యక్రియలు జరిగాయి. వీరితో పాటు మృతిచెందిన సైనికుల మృతదేహాలను గుర్తుపట్టేందుకు ఆర్మీ అధికారులు డీఎన్‌ఏ టెస్టులు చేసి వారివారి కుటుంబ సభ్యులకు అందజేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన సాయితేజ పార్థీవదేహం నేడు ఢిల్లీ నుంచి బయలు దేరింది. అయితే ఈ రోజు సాయంత్రానికి సాయితేజ భౌతికకాయం జిల్లాకు చేరుకోనుంది. ఈ నేపథ్యంలో అంత్యక్రియలు ఇవాళ నిర్వహించలేమని అంత్యక్రియలు రేపు నిర్వహిస్తామని.. రేపు ఉదయమే సాయితేజ భౌతికకాయాన్ని ఇవ్వాలంటూ సాయితేజ బాబాయి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆర్మీ అధికారులను కోరామని సాయితేజ బాబాయి సుదర్శన్‌ వెల్లడించారు.