Site icon NTV Telugu

ఐసీయూలో చేరిన సైరా భాను

Saira Banu hospitalised

Saira Banu hospitalised

దివంగత, దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ సతీమణి సైరా బాను మూడు రోజుల క్రితం రక్తపోటు సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరింది. ఆమె పరిస్థితి కాస్త విషమించడంతో ముంబైలోని హిందూజా ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) కి తరలించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ స్నేహితులు ధృవీకరించారు. కాగా, జూలై 7, 2021న మరణించిన దిలీప్ కుమార్ కూడా అదే ఆసుపత్రిలో చేరారు. అతను ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు.

సైరా బాను ఇటీవల తన భర్త దిలీప్ కుమార్‌ను కోల్పోవడంతో అనారోగ్యానికి గురైంది. సైరా – దిలీప్ లది ప్రేమ వివాహం, చాలా మందికి స్ఫూర్తినిచ్చే వివాహబంధం వారిది. ఇన్ని సంవత్సరాలలో సైరా, దిలీప్ కు వెన్నెముకగా నిలిచింది. అతను అనారోగ్యానికి గురైనన్ని రోజులు అతనిని పూర్తిగా దగ్గర ఉండి మరి చూసుకొంది. దిలీప్ కుమార్‌ మరణించిన ఆత్మకు ఎంతో గౌరవం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీ మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేలకు సైరా కృతజ్ఞతలు కూడా తెలిపింది.

Exit mobile version