హీరో సాయిధరమ్ తేజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్టు ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. సెప్టెంబర్ 10 వ తేదీన సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ లో గాయపడిన సంగతి తెలిసిందే. 35 రోజులపాటు సాయిధరమ్ తేజ్ ఆసుపత్రిలో చికిత్స పోందారు. సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకొని ఇంటికి వచ్చాడని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రమాదం నుంచి బయటపడిన తేజ్‌కు ఇది పునర్జన్మ అని మెగాస్టార్ ట్వీట్ చేశారు. సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఇదిలా ఉంటే తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1 వ తేదీన రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. సినిమా తారల నుంచి పొలిటీషియన్ల వరకు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
Read: బీమ్లానాయక్ సెకండ్ సింగిల్… సోషల్ మీడియాలో హల్చల్
