NTV Telugu Site icon

ఆర్టీసి కీల‌క నిర్ణ‌యం: ఉద‌యం 4 గంట‌ల నుంచే సిటీ స‌ర్వీసులు…

క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.  స్కూళ్లు, కాలేజీలు, ఉపాది రంగాలు తిరిగి తెరుచుకున్నాయి.  జ‌న‌జీవ‌నం సాధార‌ణంగా మారిపోయింది.  హైద‌రాబాద్ న‌గ‌రంలో ర‌ద్దీ పెరిగింది.  ఇప్ప‌టికే సిటీ బ‌స్ స‌ర్వీసుల‌ను అందుబాటులో ఉంచిన ఆర్టీసీ, తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.  తెల్లవారు జాము 4 గంట‌ల నుంచే ఆర్టీసీ బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచుతున్న‌ట్టు ప్ర‌క‌టించింది.  సికింద్రాబాద్‌, నాంప‌ల్లి, కాచిగూడ రైల్వే స్టేష‌న్ల‌తో పాటుగా, ఎంజీబీఎస్‌, జేబీఎస్ లలో కూడా తెల్ల‌వారుజామున 4 గంట‌ల నుంచే సిటీ బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ది.  

Read: ఇంటి నిర్మాణాల కోసం స‌రికొత్త టెక్నాల‌జీ… త‌క్కువ సమయంలో కాల‌నీల ఏర్పాటు…

ఈ ప్రాంతాల నుంచి న‌గ‌రంలోని అన్ని ప్రాంతాల‌కు ఉద‌యం 4 గంట‌ల నుంచి బ‌స్సులు బ‌య‌లుదేర‌నున్నాయి.  క‌రోనాకు ముందు ఉన్న‌ట్టుగానే ఉద‌యం 4 గంట‌ల నుంచే అన్ని బ‌స్సులు అందుబాటులో ఉంటాయ‌ని తెలంగాణ ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.  ఇక విద్యావ్య‌వ‌స్థ‌లు పూర్తిస్థాయిలో తెరుచుకోవ‌డంతో విద్యార్థుల‌కు కోసం కోఠీ- హ‌య‌త్‌న‌గ‌ర్ మ‌ధ్య అద‌నంగా మ‌రో 12 సర్వీసుల‌ను న‌డుపుతున్న‌ట్టు ఆర్టీసీ అధికారులు తెలియ‌జేశారు.  ఈరోజు నుంచి ఈ స‌ర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.