Site icon NTV Telugu

ఓటీటీలో ‘RRR’ మూవీ వచ్చేది ఎప్పుడంటే…?

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించే ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో మూవీ ప్రమోషన్‌లు జోరుగా నడుస్తున్నాయి. ఈ రోజు విడుదలైన ట్రైలర్ గురించి రివ్యూలు, సినిమా కథ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రామ్‌చరణ్-ఎన్టీఆర్ నటన.. ఇలా పలు అంశాల గురించి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందనే విషయంపైనా పలువురు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

Read Also: ‘పుష్ప’ మూవీ ఏమైనా తేడా కొడితే నా చావు చూస్తారు

మరోవైపు ఇటీవల కాలంలో పలు సినిమాలు మూడు, నాలుగు వారాల్లోనే ఓటీటీల్లో దర్శనమిస్తున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ మూవీ కూడా నాలుగు వారాల్లో ఓటీటీలో వస్తుందని పలువురు భావిస్తున్నారు. అలాంటి వాళ్లకు మూవీ మేకర్స్ షాకిచ్చే న్యూస్ చెప్పారు. ఆర్.ఆర్.ఆర్ మూవీ థియేటర్లలో విడుదలైన మూడు నెలల వరకు విడుదల కాదని మూవీ మేకర్స్ స్పష్టం చేశారు. ఈ సినిమా ఆల్ లాంగ్వేజెస్ ఓటీటీ హక్కులను బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ పెన్ స్టూడియోస్ సంస్థ దక్కించుకుంది. తెలుగు ఓటీటీ హక్కులను జీ5, హిందీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థలు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version