‘పుష్ప’ మూవీ ఏమైనా తేడా కొడితే నా చావు చూస్తారు

హీరోలంటే ఫ్యాన్స్ కి పిచ్చి… హీరోల కోసం ఫ్యాన్స్ ఎలాంటి పనులైనా చేస్తారు.. హీరోల సినిమాలు రిలీజ్ అయితే వారికి పండగే.. ఇక ఆ సినిమా హిట్ టాక్ తెచ్చుకొంది అంటే పూనకాలే.. థియేటర్ల వద్ద రచ్చ రచ్చ చేస్తారు. వారి అభిమానం అలాంటిది. అయితే ఆ అభిమానం హద్దులు దాటకూడదు. సాధారణంగా డైరెక్టర్లకు మా హీరో సినిమా మంచిగా తీయకపోతే చంపేస్తాం.. ఎలివేషన్స్ సరిగ్గా లేకపోతే డైరెక్టర్లను ట్రోల్ చేయడం లాంటివి చూస్తూనే ఉంటాం.. కానీ , ఇక్కడా ఒక అభిమాని మాత్రం సినిమా ఏదైనా తేడాకొడితే చచ్చిపోతాను అని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

‘అలా వైకుంఠపురం’ తరువాత అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం ‘పుష్ప’.. క్లాసిక్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ , పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఇటీవల విడుదలైన ట్రైలర్ మాత్రం ఫ్యాన్స్ ని కొంత నిరాశపరిచిందనే చెప్పాలి. దీంతో ఇప్పటి వరకు ఈ సినిమాపై ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకం కొద్దిగా సన్నగిల్లింది. ఈ ట్రైలర్ చూసిన ఒక అభిమాని షాకింగ్ డెసిషన్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

“ట్రైలర్ చూసి నా మనసు చచ్చిపోయింది..ఇంకా నా వల్ల కాదు. ఇన్ని రోజులు మీకు చాలా గౌరవం ఇచ్చి ట్వీట్ వేశాను. పుష్ప సినిమా ఏమైనా తేడా కొడితే మొదటి రోజే నా చావు చూస్తారు.. ఒట్టు వేసి ఒక మాట వేయకుండా ఒక మాట నేను చెప్పను ట్విట్టర్‌కు గుడ్ బై.. ” అంటూ చెప్పుకొచ్చాడు. అభిమానం హద్దు దాటకూడదు.. సినిమా ఒక ఎంటర్ టైన్మెంట్.. దాని అలాగే చూడాలి.. అంతేకాని సినిమా హిట్ అవ్వకపోతే చచ్చిపోతాలాంటి షాకింగ్ డెసిషన్స్ తీసుకోకూడదు అంటూ నెటిజన్లు అతనికి హితబోధ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక తాజాగా అభిమాని జోక్ చేసినట్లు చెప్పడంతో అందరు అతడిని తిట్టిపోస్తున్నారు. ఏదిఏమైనా అభిమానుల మాటలకూ అర్థాలు వేరులే అని అనుకుంటున్నారు నెటిజన్లు.

Related Articles

Latest Articles