Site icon NTV Telugu

“మా” ఎన్నికల్లో వాళ్ళకే నా సపోర్ట్ : రోజా

Roja

Roja

ఈసారి ‘మా’ ఎన్నికలు వాడివేడిగా సాగుతున్నాయి. మంచు విష్ణు ప్యానల్, ప్రకాష్ రాజ్ ప్యానల్ ల మధ్య గట్టి పోటీ నెలకొంది. అక్టోబర్ 10న ‘మా’ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ‘మా’ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనే విషయం ఆసక్తికరంగా మారింది. టాప్ సెలెబ్రిటీలు, సీనియర్ హీరోహీరోయిన్లు సైతం మీడియా ముందుకు వచ్చి తమ సపోర్ట్ ఎవరికీ అనే విషయాన్ని బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి, నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా తన సపోర్ట్ ఎవరికీ అన్న విషయాన్ని తాజా మీడియా సమావేశంలో తెలియజేసింది.

Read Also : తేజ్ హెల్త్ పై మెగా బ్రదర్ అప్డేట్

“ఖచ్చితంగా ఒక ‘మా’ ఆర్టిస్ట్ గా ‘మా’ ఎన్నికల్లో పాల్గొంటాను. కానీ ఈరోజు ‘మా’ అసోసియేషన్ ను అభివృద్ధి చేయడానికి ఎవరు ఏం చేస్తారు ? అనే విషయాన్ని తెలియజేస్తూ మేనిఫెస్టో విడుదల చేశారు. దాంట్లో ‘మా’ ఆర్టిస్టులకి ఏ మేనిఫెస్టో ఉపయోగకరంగా ఉంటుందో వారికే ఓటు వేస్తాను” అని అన్నారు. అయితే “మా”లో లోకల్, నాన్ లోకల్ అనే వివాదం నడుస్తోంది. మీరు దేనికి సపోర్ట్ చేస్తారు ? అని అడగ్గా… “కాంట్రవర్సీ ప్రశ్నలు నన్ను అడగొద్దు. ఈసారి ‘మా’ ఎన్నికలు మా రాజకీయ ఎన్నికలకన్నా వాడిగా వేడిగా సాగుతున్నాయి. అందులో నేను వేలు పెట్టదలచుకోలేదు. కానీ ఒక ఆర్టిస్ట్ గా నా ఓటును మాత్రం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటాను. ‘మా’ను ఎవరైతే అభివృద్ధి చేస్తారని నమ్ముతానో ఆ ప్యానల్ కే ఓటు వేస్తాను” అని అన్నారు.

Exit mobile version