Site icon NTV Telugu

పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు.. సీఎం అత్యవరసర సమావేశం..

కరోనా రక్కసి కొత్త కొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే కరోనా డెల్టా వేరియంట్తో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ ఇప్పడు భారత్‌లో వ్యాప్తి చెందుతోంది. రోజు రోజుకు ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 358 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా తమిళనాడులో కూడా ఒమిక్రాన్‌ కేసులు నమోదవుతున్నాయి.

ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్‌ ఉన్నతస్థాయి అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఒమిక్రాన్‌ విజృంభనను దృష్టిలో ఉంచుకొని తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించనున్నారు. అయితే ఇప్పటికే క్రిస్మస్‌, న్యూయర్‌ వేడుకలపై నిషేధం విధించారు. అయితే ఇప్పడు నైట్‌ కర్ఫ్యూపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Exit mobile version