NTV Telugu Site icon

మంత్రి మల్లారెడ్డి భూ కబ్జా..? కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్..

మూడుచింతల వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి… మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు చేసిన రేవంత్… గుండ్ల పోచంపల్లిలో మల్లారెడ్డి బామ్మర్ది శ్రీనివాస్ రెడ్డి.. తప్పుడు పత్రాలు చూపించి భూములు కబ్జా చేసినట్టు విమర్శించారు.. మల్లారెడ్డి సగం జోకర్, సడం బ్రోకర్‌ అని వ్యాఖ్యానించిన రేవంత్.. భూములు అమ్మినా..? కొన్నా..? మల్లారెడ్డికి మాములు ఇవ్వాలంట అంటూ ఫైర్‌ అయ్యారు.. ఇక, జవహర్ నగర్‌లో తప్పుడు పత్రాలు సృష్టించి మల్లారెడ్డి ఆస్పత్రి కట్టిండని మండిపడ్డపడ్డ రేవంత్.. సూరారంలో చెరువును కబ్జా చేసి హాస్పిటల్ కట్టినట్టు ఆరోపణ చేశారు.. ఇలా సర్కార్ భూములు కబ్జా చేసి.. ఆస్పత్రి, కాలేజీలు కట్టాడని.. మల్లారెడ్డి యూనివర్సిటీకి అనుమతి వచ్చిన భూమి కూడా దొంగ భూమేనంటూ సంచలన ఆరోపణలు చేశారు.. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే.. మంత్రి మల్లారెడ్డి భూములపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి.. అది తప్పు అని తేలితే నేను ఏ శిక్ష కైనా సిద్ధమని ప్రకటించారు.

Show comments