Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Remembering The Versatile Actor Amrish Puri On His Birth Anniversary

అనితరసాధ్యుడు అమ్రిష్ పురి

Published Date :June 22, 2021 , 6:00 am
By Prakash
అనితరసాధ్యుడు అమ్రిష్ పురి
  • Follow Us :
  • google news
  • dailyhunt

(జూన్ 22న అమ్రిష్ పురి జయంతి)
‘ఫలితం దక్కలేదని విచారించకు. ఫలితం చిక్కే దాకా ప్రయత్నిస్తూనే ఉండు’ అన్నదే అమ్రిష్ పురి సిద్ధాంతం. తాను కోరుకున్న సినిమా రంగంలో రాణించడానికి అమ్రిష్ పురి పలు పాట్లు పడ్డారు. చివరకు బాలీవుడ్ ను శాసించే స్థాయికి చేరుకున్నారు. ‘ఆఖరి పోరాటం’, ‘కొండవీటి దొంగ’, ‘జగదేకవీరుడు – అతిలోకసుందరి’, ‘ఆదిత్య 369’, ‘అశ్వమేధం’, ‘నిప్పురవ్వ’, ‘మేజర్ చంద్రకాంత్’ వంటి తెలుగు చిత్రాలలో అలరించారు. దక్షిణాది అన్ని భాషల్లోనూ నటించన అమ్రిష్ పురి విఖ్యాత హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్ బెర్గ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇండియానా జోన్స్ అండ్ ద టెంపుల్ ఆఫ్ ద డూమ్’ చిత్రంలో నటించి అంతర్జాతీయంగానూ పేరు సంపాదించారు. అంతకు ముందు రిచర్డ్ అటెన్ బరో తెరకెక్కించిన ‘గాంధీ’లో ఖాన్ పాత్రలో జీవించీ ఆకట్టుకున్నారు. నున్నటి గుండుతో అనేక చిత్రాలలో నటించిన నటునిగానూ అమ్రిష్ పురి చరిత్ర సృష్టించారు.

అలా అలా…
పంజాబ్ లో జన్మించిన అమ్రిష్ పురి చిన్నతనం నుంచీ తన చుట్టూ ఉన్నవారికి వినోదం పంచుతూ ఉండేవారు. తన అన్నలు చమన్ పురి, మదన్ పురి హిందీ చిత్రసీమలో రాణిస్తూ ఉన్న సమయంలోనే అమ్రిష్ కూడా ముంబయ్ లో అడుగు పెట్టారు. ఆరంభంలోనే స్క్రీన్ టెస్ట్ లో ఆకర్షించలేకపోయాడు. దాంతో పృథ్వీ థియేటర్స్ లో చేరి సత్యదేవ్ దూబే రాసిన నాటకాల్లో నటిస్తూ ఉండేవారు. నాటకరంగంలో పేరు సంపాదించిన అమ్రిష్ పురికి శ్యామ్ బెనెగల్ చిత్రాలలో మంచి గుర్తింపు లభించింది. అయితే శ్యామ్ సినిమాలన్నీ సమాంతర చిత్రాలు కావడంతో అమ్రిష్ కు కమర్షియల్ బ్రేక్ లభించలేదు. అయినా తనకు లభించిన పాత్రలను పోషిస్తూ ఉండేవారు. తెలుగులో విజయం సాధించిన ‘మనవూరి పాండవులు’ ఆధారంగా హిందీలో బాపు రూపొందించిన ‘హమ్ పాంచ్’ చిత్రంలో వీరప్రతాప్ సింగ్ గా నటించి ఆకట్టుకున్నారు అమ్రిష్. ఆ సినిమా తరువాత అనేక కమర్షియల్ మూవీస్ లో నటిస్తూ తనదైన బాణీ పలికించారు. “విధాత, శక్తి, హీరో” వంటి చిత్రాలలో అమ్రిష్ పురి అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఆయన నటన కోసమే సినిమాలకు వెళ్ళే రోజులు ఉండేవి. ఇక ‘మిస్టర్ ఇండియా’లో ముగాంబో పాత్రతో జనాన్ని భలేగా ఆకట్టుకున్నారు. “త్రిదేవ్, ఘాయల్, దామిని” చిత్రాల్లోనూ అమ్రిష్ విలక్షణమైన పాత్రలు పోషించారు. విలన్ గా భయపెట్టడమే కాదు, “దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే, ఫూల్ ఔర్ కాంటే, పర్ దేశ్, విరాసత్, ఘటక్, చీనా గేట్” వంటి చిత్రాలలో పాజిటివ్ రోల్స్ లోనూ అమ్రిష్ పురి అభినయం అలరించింది.

తెలుగు సినిమాల్లో…
తెలుగునాట అమ్రిష్ పురి తొలిసారి నటించిన చిత్రం కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘ఆఖరి పోరాటం’. ఇందులో తన సంభాషణలు తానే చెప్పుకొని ఆకట్టుకున్నారు. అమ్రిష్‌ పురి తెలుగు పలుకు అంత బాగాలేకపోయినా, అందులోనే ఓ వైవిధ్యం కనిపించింది. అదే తెలుగువారినీ ఆకట్టుకుంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ‘జగదేకవీరుడు-అతిలోకసుందరి’ ‘మేజర్ చంద్రకాంత్’, ‘అశ్వమేధం’లోనూ అమ్రిష్ పురి ప్రతినాయక పాత్రల్లో అలరించారు. ఇక మహానటుడు యన్టీఆర్ తో ‘మేజర్ చంద్రకాంత్’లో నటించడం మరపురాని అనుభూతి అని అమ్రిష్ పురి చెప్పారు. బాలకృష్ణతో “ఆదిత్య 369, నిప్పురవ్వ, అశ్వమేధం” చిత్రాలలో నటించారు. చిరంజీవితో “కొండవీటి దొంగ, జగదేకవీరుడు -అతిలోకసుందరి”లో అభినయించారు పురి. నాగార్జునతో ‘ఆఖరి పోరాటం’లో ఆకట్టుకొనేలా నటించారు. తెలుగునాట అమ్రిష్ పురి నటించిన చిత్రాలు కొన్నే అయినా, అవన్నీ బాక్సాఫీస్ ను కొల్లగొట్టినవే కావడం విశేషం.

తెరపై విలన్ గా ఎంతగానో భయపెట్టిన అమ్రిష్ పురి, నిజజీవితంలో ఎంతో సౌమ్యుడు. శాకాహారి, ప్రకృతి చికిత్సతో సాగేవారు. ఎప్పుడూ శరీరాన్ని గట్టిగా ఉంచుకొనడానికి ప్రయత్నించేవారు. సదా నవ్వుతూ, నవ్విస్తూ ఉండేవారు. అందుకే ఆయనతో నటించడానికి సహనటీనటులు సైతం ఉత్సాహంతో ఉరకలు వేసేవారు. అలాంటి అమ్రిష్‌ పురి నేడు మన మధ్య లేకపోయినా, ఆయన అభినయం కాశ్మీరం నుండి కన్యాకుమారి దాకా ఉన్న అభిమానుల మదిలో సదా నిలచి పోయింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amrish Puri
  • Happy Birthday Amrish Puri
  • HBD Amrish Puri

తాజావార్తలు

  • IMDb Best IPL Matches: ఇన్ని సీజన్లలో టాప్ 5 బెస్ట్ ఐపీఎల్ మ్యాచ్‌లు ఏవో తెలుసా..

  • KTR : జీవన్ రెడ్డి BRSలోకి… కేటీఆర్ హాట్ కామెంట్స్

  • Bangladesh Cricket: స్టేడియంలో కాఫీ ఖర్చంత కూడా లేని ఆ దేశ స్టార్ ప్లేయర్ల జీతాలు..!

  • Rashid Khan: వెన్ను గాయం వెంటాడుతోంది.. డాక్టర్లు హెచ్చరించారు.. అయినా కానీ..?

  • Sensational Verdict: ఆంటీ అన్నారని కోర్టుకు వెళ్లిన మహిళ.. తీర్పు ఏమొచ్చిందో తెలుసా..

ట్రెండింగ్‌

  • Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions