Site icon NTV Telugu

జియో మ‌రో కీల‌క నిర్ణ‌యం… రూపాయికే…

రిల‌యన్స్ జియో మిగ‌తా ప్యాకేజీల‌తో పాటే టారిఫ్‌ల‌ను పెంచింది.  టారిఫ్‌లను అనూహ్యంగా పెంచిన జియో, వినియోగ‌దారుల‌కు మ‌రో ఊర‌ట‌నిచ్చే విధంగా ఓ ప్ర‌క‌ట‌న చేసింది.  అదేమంటే, రూపాయికే 100 ఎంబీ డేటాను అందిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.  రూపాయికి 100 ఎంబీని ఏ మొబైల్ నెట్‌వ‌ర్క్ సంస్థ ఇప్ప‌టి వ‌ర‌కు అందించ‌లేదు.  28 రోజుల వ్యాలిడిటీ కాకుండా 30 రోజుల వ్యాలిడిటీని ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించింది.  

Read: తాండూరు టీఆర్ఎస్‌లో ఆగని తన్నులాటలు..!

జియో 1 జీబీ డేటాను రూ.15కి అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.  1 రూపాయికి 100 ఎంబీ డేటా అంటే, 10 రూపాయ‌ల‌కు 1 జీబీ డేటా వ‌స్తుంద‌న్న‌మాట‌.  జియో తీసుకున్న ఈ కీల‌క నిర్ణ‌యంతో మొబైల్ నెట్‌వ‌ర్క్‌లు షాక‌య్యాయి.  ప్ర‌పంచం మొత్తంమీద చూసుకుంటే అత్యంత చౌకైన డేటాను అందిస్తున్న సంస్థ జియోనే అని చెప్ప‌వ‌చ్చు.  

Read: బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

గ‌తంలో అతి త‌క్కువ ధ‌ర‌కు మొబైల్ ఫోన్‌ల‌ను అందించింది కూడా రిల‌య‌న్స్ కంపెనీనే. రిల‌యన్స్ మొబైల్స్ జియోను లాంచ్ చేసిన త‌రువాత స్మార్ట్ ఫోన్‌ల‌ను త‌క్కువ ధ‌ర‌ల‌కే అందించి మెప్పించింది. ఇప్పుడు ఇంట‌ర్నెట్ విష‌యంలోనూ రూపాయికే 100 ఎంబీ డేటాను అందించి మిగ‌తా కంపెనీల‌కు షాక్ ఇచ్చింది.

Exit mobile version