ప్రేయసి పెళ్లి.. దండలు మార్చుకుంటుంటే మధ్యలో దూరిన మాజీ లవర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాత సినిమాల నుంచి నేటి సినిమాల వరకు ప్రేయసికి మరో వ్యక్తితో పెళ్లి జరగడం.. ప్రియుడు మధ్యలోకి ఎంట్రీ ఇవ్వడం.. ఆపండి అంటూ అరుపులు.. లేదా పెళ్లిపీఠలపై నుంచే తీసుకెళ్లడం.. తాలికట్టే సమయానికి వచ్చి ఆ తంతు పూర్తిచేయడం.. ఇలా ప్రేమ, పెళ్లి చుట్టూ.. తిరిగే ఎన్నో సన్నివేశాలు సినిమాల్లో చూస్తుంటాం.. ఇలాంటి ఘటనలు రీల్‌పైనే కాదు.. రియల్‌గా చూసిన సందర్భాలు కూడా ఉంటాయి.. తాజాగా తాన మాజీ ప్రేయసితో మరో వ్యక్తికి వివాహం జరుగుతుంటూ.. మధ్యలో దూరిన ఓ యువకుడు.. ఆమె నుదుటిపై సింధూరం దిద్ది.. ఆమెను సొంతం చేసుకోవాలని భావించాడు.. కానీ, వధువు ఎలా స్పందించింది..? బంధువులు ఏం చేశారు..? చివరకు పెళ్లి ఎవరితో జరిగింది..? అనే విషయాలు తెలుసుకోవడానికి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్‌లోని హర్‌పూర్‌లో బంధు మిత్రుల సమక్షంలో ఓ వివాహ వేడుక జరుగుతోంది.. వధూవరులు దండులు మార్చుకుంటున్నారు.. ఇంతలో పెళ్లి మండపంలోకి సడెన్‌గా ఎంట్రీ ఇచ్చాడు ఓ యువకుడు.. దండలు మార్చుకుంటుండగా వెంటనే వారి మధ్యలోకి దూరి వధువు నుదుటిపై కుంకుమ దిద్దడానికి ప్రయత్నించాడు. వధువు వారిచే ప్రయత్నం చేస్తుండగా.. బలవంతంగా ఆమె నుదుటిపై సింధూరాన్ని దిద్దాడు. ఊహించని ఘటనతో షాక్‌తిన్న కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే తేరుకొని.. సదరు యువకుడిని పట్టుకుని చితకబాదారు.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కి రచ్చ చేస్తున్నాయి.. తీరా ముఖానికి గుడ్డ కట్టుకొని వచ్చిన ఆ యువకుడు ఎవరా అని ఆరా తీస్తే.. పెళ్లి కూతురు మాజీ ప్రేమికుడని తెలిసింది. గతంలో ఆ యువకుడు తనను ప్రేమించాలంటూ ఆ యువతి వెంట పడ్డాడట.. కానీ, ఆమె తిరస్కరించిందట.. ఇక, సదరు యువకుడు మరో ప్రాంతానికి వెళ్లిపోవడం.. ఇంతలో ఆ యువతికి మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయించడం.. పెళ్లి కూడా జరుగుతుండడంతో.. ఆ సమాచారం తెలుసుకున్న యువకుడు.. తన ప్రేయసిని పెళ్లిచేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఇలా చేసినట్టు తేలింది.. దీంతో.. తాత్కాలికంగా ఆ పెళ్లి నిలిచిపోయింది.. ఆ పంచాయతీ అంతటితో ఆగలేదు.. మరుసటి రోజు పెద్దలు కుదిర్చిన వరుడితోనే యువతి పెళ్లి జరిపించారు.. మొత్తంగా ప్రేయసి కోసం ప్రియుడు చేసిన ప్రయత్నం మాత్రం ఫలించలేదు.
Also Read
- Tags
తాజావార్తలు
-
Gaddam Prasad: “చర్యలు తీసుకుంటాం”.. స్పీకర్‌ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
-
Citizen Vigilante: హింసకు భయపడి జర్మనీ ఆపేసిన సినిమా.. ఎలాన్ మస్క్ ఎంట్రీతో ఒక్కసారిగా..!
-
Dragan : డ్రాగన్.. రంగంలోకి దిగిన లూగర్
-
TDP Leadership Conclave: నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ బ్లూప్రింట్
-
Siddipet District: కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో ఉద్రిక్తత.. ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు..
ట్రెండింగ్
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!