NTV Telugu Site icon

పేటియంకు షాకిచ్చిన ఆర్బీఐ.. ఎందుకో తెలుసా..?

ప్రముఖ పేమెంట్స్ దిగ్గజ సంస్థ పేటీయంకు రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) షాకిచ్చింది. పేటియం పేమెంట్స్ బ్యాంక్‌ ఫైనల్‌ సర్టిఫికేట్‌ ఆఫ్‌ అథరైజేషన్‌ జారీ చేయాలని కోరుతూ ఆర్బీఐకి దరఖాస్తు చేసుకుంది. దీంతో ఈ దరఖాస్తును పరిశీలించగా అసలు విషయాలు బయటకు వచ్చాయి.

2007 పేమెంట్‌, సెటిల్మెంట్ సిస్టమ్స్‌ నిబంధనల ఉల్లఘించినట్లు తేలింది. అక్టోబర్‌ 20న పేటియం కొన్ని నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను కోటి రూపాయల జరిమానాను పీపీబీఎల్‌(PPBL)కు విధించింది. ఫైనల్‌ ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు వాస్తవానికి భిన్నంగా ఈ రికార్డులు ఉండడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.