NTV Telugu Site icon

ఆఫ్ఘన్ కెప్టెన్ గా తప్పుకున్న రషీద్ ఖాన్…

Rashid Khan

Rashid Khan

యూఏఈలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ కు ముందు ఆఫ్ఘనిస్తాన్ కు షాక్ తగిలింది. రషీద్ ఖాన్ తన కెప్టెన్ బాధ్యతల నుండి తప్పుకున్నాడు. అయితే ఈ ఏడాది అక్టోబర్ లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ కు ఇప్పటివరకు 8 జట్లు అర్హత సాధించాయి. అందులో ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒక్కటి. ఈ పొట్టి ఫార్మాట్ లో ఎంతో బలవంతమైన జట్టుగా ఎదిగిన ఆఫ్ఘన్ ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్ లో 8వ స్థానంలో ఉంది. అయితే ప్రపంచ కప్ సమయం దగ్గరకు వస్తుండటంతో అన్ని దేశాల బోర్డులు తమ జట్లను ప్రకటిస్తుండగా నిన్న ఆఫ్ఘనిస్తాన్ కూడా తమ జట్టును ప్రకటించింది. ఈ విషయంలోనే ఆ జట్టు టీ20 కెప్టెన్ గా ఉన్న రషీద్ ఖాన్ అసహనానికి లోనయ్యాడు. ఈ మెగా టోర్నీకి జట్టును ఎంపిక చేసే సమయంలో కెప్టెన్ అయిన తనను బోర్డు సభ్యులు సంప్రదించలేదని… అందుకే కెప్టెన్సీ బాధ్యతల నుండు తప్పుకుంటున్నాను తెలిపాడు. కానీ ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఆడటం తనకు ఎప్పుడు గర్వకాణమే అని ప్రకటించాడు. ఇక రషీద్ తప్పుకోవడంతో ఆ జట్టుకు ఆల్ రౌండర్ నబీ ని కెప్టెన్ గా నియమించనున్నట్లు తెలుస్తుంది.