NTV Telugu Site icon

#Embassychallange: ‘నాటు నాటు’కు జర్మన్ ఎంబసీ డ్యాన్స్..

Nattu Nattu

Nattu Nattu

ప్రపంచవ్యాప్తంగా నాటు నాటు ఫీవర్ బారిన పడని వారు ఎవరూ ఉండరు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ గెలవడంతో ఇప్పుడు ఎక్కడ విన్న నాటు నాటు పాటే వినిపిస్తోంది. ఆపాట, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల డాన్స్ కు ఉన్న క్రేజ్ అలాంటిది. ఇటీవల, జర్మన్ ఎంబసీ సిబ్బంది పాత ఢిల్లీ వీధుల్లో ఈ నాటు నాటు పాటకు డ్యాన్స్ చేశారు. కొరియన్ ఎంబసీ సభ్యుల తర్వాత, భారతదేశంలోని జర్మన్ రాయబారి డాక్టర్ ఫిలిప్ అకర్‌మాన్, ఎంబసీలోని ఇతర సిబ్బంది ఢిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతంలో నాటు నాటుకు తమ ప్రదర్శనతో అందరినీ మంత్రముగ్దులను చేశారు.

RRRలో ప్రధాన నటులలో ఒకరైన రామ్ చరణ్ కూడా వారి డ్యాన్స్ పై స్పందించారు.అద్భుతంగా చేశారంటూ కితాబు ఇచ్చారు. జర్మన్ ఎంబసీ సభ్యులు పగటిపూట వీధుల్లో డ్యాన్స్ చేస్తున్న వీడియోను రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. జర్మన్‌లో ధన్యవాదాలు తెలిపారు.


ఢిల్లీలో నాటు నాటు విజయాన్ని జరుపుకున్నామని డాక్టర్ ఫిలిప్ అకెర్‌మాన్ ట్వీట్ చేశారు. హీరో రామ్ చరణ్, RRR బృందానికి అభినందనులు తెలిపారు. అంతేకాదు నాటు నాటు ఛాలెంజ్ కోసం భారతదేశంలోని ఇతర రాయబార కార్యాలయాలను కూడా సవాలు విసిరారు డాక్టర్ ఫిలిప్ అకెర్‌మాన్. #embassychallange అంటూ ఛాలెంజ్ విసిరారు.

Also Read: Tower Ride Crashes: రాజస్థాన్ ఫెయిర్‌లో ప్రమాదం.. 11 మందికి తీవ్ర గాయాలు

కాగా, గత నెలలో దక్షిణ కొరియా రాయబార కార్యాలయం నాటు నాటు ట్రెండ్‌ను పవర్ ప్యాక్డ్ ప్రదర్శనతో ప్రారంభించింది. కొరియా రాయబారి చాంగ్ జే-బోక్, ఇతర రాయబార కార్యాలయ సిబ్బందితో కలిసి ట్రాక్‌కి వెళ్లారు. కాగా, నాటు నాటు చిత్రానికి సంగీతాన్ని ఎమ్ఎమ్ కీరవాణి అందించారు. నాటు నాటు పాటను రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించగా, చంద్రబోస్ లిరిక్స్ రాశారు.