NTV Telugu Site icon

రాజస్థాన్ మాజీ సీఎం కరోనాతో కన్నుమూత… 

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.  కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా భారీ స్థాయిలో నమోదవుతున్నాయి.  రోజుకు నాలుగు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.  సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవరిని కరోనా వదలడం లేదు.  కరోనాతో అనేక మంది రాజకీయ ప్రముఖులు మృతి చెందిన సంగతి తెలిసిందే.  ఇటీవలే ఉత్తర ప్రదేశ్ రెవిన్యూ శాఖ మంత్రి విజయ్ కశ్యప్ మృతి చెందిన సంగతి తెలిసిందే.  కాగా, తాజాగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా కరోనాతో మృతి చెందారు.  1980-81 లో అయన రాజస్థాన్ కు ముఖ్యమంత్రిగా చేశారు. ఆ తరువాత హర్యానా, బీహార్ రాష్ట్రాలకు కూడా అయన గవర్నర్ గా పనిచేశారు.