Site icon NTV Telugu

బీసీసీఐ కీలక నిర్ణయం : టీమిండియా కోచ్‌గా ద్ర‌విడ్‌

జూన్‌ 18-22 మధ్య జరిగే వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్‌తో ఆడేందుకు భారత జట్టు ఇంగ్లాండ్ వెళ్లనుంది. ఆ తర్వాత అక్కడే ఉండి ఆగస్టులో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌ ఆడనుంది. కానీ ఈ మధ్యలో జులైలో బీసీసీఐ మరో టూర్‌ను ప్లాన్ చేసింది. గతేడాది కరోనా వాయిదా పడిన శ్రీలంక పర్యటనను తెరమీదకు తీసుకొచ్చింది. శ్రీలంక పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. జూలై 13, 16, 19 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు జరగనుండగా జూలై 22, 24, 27 తేదీల్లో టీ20 సిరీస్ జరగనుంది. అయితే ఈ శ్రీలంక టూర్ కు వెళ్లనున్న టీం ఇండియా జట్టు కోచ్ గా మాజీ కెప్టెన్‌, నేషనల్ క్రికెట్ అకాడమీ ఛైర్మన్ రాహుల్ ద్రవిడ్ వ్యవహరిం చనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. 2014 తర్వాత ద్రవిడ్ టీం ఇండియా ప్రధాన జట్టుతో కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి. 2014లో ఇండియా టీం ఇంగ్లండ్ తో పర్యటిం చినప్పుడు బ్యాటింగ్ కన్సల్టెంట్ గా వ్యవహరించాడు. ఇక తాజాగా శ్రీలంక టూర్ కు వెళ్లనున్న టీం ఇండియా జట్టు కోచ్ గా రాహుల్ ద్రవిడ్ ను బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది.

Exit mobile version