Site icon NTV Telugu

టీమిండియా కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌

భారత క్రికెట్‌ టీమ్‌ ప్రధాన కోచ్‌గా మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను నియమించింది బీసీసీఐ.. 2023 వరల్డ్ కప్ ముగిసే వరకు టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ బాధ్యతలు నిర్వహించనున్నారు.. ఇక, ప్రస్తుతం హెడ్‌ కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి… టీ-20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కోచ్ పదవికి రాజీనామా చేశాయనున్నారు.. ఐపీఎల్‌ 2021 ఫైనల్‌ మ్యాచ్‌ ముగిసిన తర్వాత రాహుల్ ద్రవిడ్‌తో సమావేశమైన సౌరవ్ గంగూలీ, జయేషా.. దీనిపై చర్చించారు… ఇక, పరాస్ మాంబ్రేను బౌలింగ్ కోచ్‌గా కావాలని రాహుల్‌ ద్రవిడ్‌ కోరడం.. గంగూలీ, జయేషా.. గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు బ్యాటింగ్ కోచ్ గా విక్రం రాథోడ్ కొనసాగనున్నారు. అయితే, దీనిపై బీసీసీఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

48 ఏళ్ల ద్రవిడ్, టీమిండియా కోసం ఆడిన అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరు, గత ఆరు సంవత్సరాలుగా ఇండియా ఏ మరియు అండర్‌ 19 సెటప్‌కి బాధ్యత వహిస్తున్నారు.. రిషబ్ పంత్, అవేశ్ వంటి చాలా మంది ఆటగాళ్లు ఖాన్, పృథ్వీ షా, హనుమ విహారి, శుబ్మన్ గిల్.. ఆయన తయారు చేసిన సిస్టమ్ ద్వారా వచ్చినవారే.. ఆయన ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి నాయకత్వం వహిస్తున్నారు. ఇక, 2023 వరల్డ్ కప్ వరకు భారత జట్టుకు కోచ్‌గా ఉండటానికి రాహుల్‌ అంగీకరించాడు. ప్రారంభంలో, అతను అయిష్టంగానే ఉన్నారు.. కానీ, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జయ్ షా.. చర్చించి ఒప్పించారు..

Exit mobile version