తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై వైసిపి ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలలో వేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ అలాగే వైసిపి పార్టీ ల మధ్య వివాదం చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ తప్పు ఉంటే భువనేశ్వరి కాళ్లు కన్నీళ్లతో కడతామని… పేర్కొన్నారు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. మహిళలు ఎవరు కించపరిచిన అది తప్పు అని తెలిపారు.
ఈ విషయాన్ని ఇంతటితో ముగింపు పలకాలని ఎమ్మెల్యే గా విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ భువనేశ్వరి అక్క తనను అనరాని మాటలు, వ్యక్తిత్వాన్ని కించపరిచారని భావిస్తే… ఆమె అనుమతితో కన్నీళ్ళతో కాళ్ళు కడుగుతానని తెలిపారు. వైఎస్ సతీమణి విజయలక్ష్మి అయినా.. చంద్రబాబు సతీమణి అయిన ఒకే గౌరవం ఉంటుందని రాజమల్లు వెల్లడించారు. ఇక రాజమల్లు చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా కుదిపేశాయి. కాగా ఇటీవల.. వల్లభనేని వంశీ .. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గారికి క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.
