Site icon NTV Telugu

1,496 వాషింగ్ మెషీన్లతో పిరమిడ్‌.. గిన్నిస్‌ రికార్డ్‌ బ్రేక్‌

యూకేకు చెందిన కర్రీస్ పీసీ వరల్డ్ అనే సంస్థ ఎలక్ట్రానిక్ రీసైక్లింగ్ గురించి అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టింది. స్థానిక కౌన్సిల్‌లు, సేవలు, రిటైలర్లు ఉచిత సేకరణ మరియు డ్రాప్-ఆఫ్ సేవలను అందిస్తున్నప్పటికీ, దాదాపు 68% మంది బ్రిటీష్ ప్రజలు తమ ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఎక్కడ మరియు ఎలా పారవేయాలనే దానిపై అయోమయంలో ఉన్నారని కంపెనీ ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో కర్రీస్ ప్రెస్టన్ స్టోర్ మేనేజర్ డారెన్ కెన్‌వర్తీ ప్రజలకు రీసైక్లింగ్‌పై అవగాహన కల్పించాలనుకున్నారు.

ఈ విషయమై అతను పిరమిడ్‌ను రూపొందించడానికి తన యజమానులను ఒప్పించాడు. ఈ పిరమిడ్‌ నిర్మించడానికి ఐన్స్‌కాఫ్ ట్రైనింగ్ సర్వీసెస్ మద్దతుగా క్రేన్, భద్రతా చర్యలను అందించింది. దీంతో కర్రీస్ పీసీ వరల్డ్ సంస్థ 1,496 రీసైకిల్ వాషింగ్ మెషీన్లతో 44 అడుగుల 7 అంగుళాల పిరమిడ్‌ను నిర్మించారు. సెప్టెంబరు 2021లో నేషనల్ రీసైక్లింగ్ వీక్ సందర్భంగా అతిపెద్ద వాషింగ్ మెషీన్ పిరమిడ్‌కు ఏర్పాటు చేసిన కర్రీస్‌ పీసీ వరల్డ్‌ గిన్నిస్‌ రికార్డును బ్రేక్‌ చేసింది.

Exit mobile version