Site icon NTV Telugu

ఆ యూనివ‌ర్శిటీలో కొత్త సీఎం డ్యాన్స్‌…

పంజాబ్ కొత్త సీఎంగా చ‌ర‌ణ్‌జిత్ చ‌న్ని ఇటీవ‌లే ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. త‌న టీమ్‌లో కొత్త మంత్రి వ‌ర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు.  వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌గ‌ర‌బోతున్న త‌రుణంలో రాష్ట్ర కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌త విభేదాల‌ను త‌గ్గించేందుకు ముఖ్య‌మంత్రి కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్‌ను ప‌క్క‌కు త‌ప్పించి ఆయ‌న స్థానంలో దళిత సామాజిక వ‌ర్గానికి చెందిన చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్ని ని ముఖ్య‌మంత్రిగా నియ‌మించారు.  దీంతో కొంతమేర అక్క‌డ అంత‌ర్గ‌త విభేదాలు త‌గ్గుముఖం ప‌డ‌తాయని కాంగ్రెస్ అభిప్ర‌య ప‌డుతున్న‌ది.  ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత చ‌ర‌ణ్‌జిత్ సింగ్ పాల‌న‌లో త‌న‌దైన ముద్ర‌ను వేసుకుంటున్నారు.  గ‌తంలో ఆయ‌న కెప్టెన్ మంత్రివ‌ర్గంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ప‌నిచేశారు. పంజాబ్‌లో సాంకేతిక విద్య‌ను ప్రోత్స‌హించారు.  కాగా,  ఇటీవ‌లే ఐకే గుజ్రాల్ యూనివ‌ర్శిటీలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న చ‌ర‌ణ్‌జిత్ సింగ్‌, అక్క‌డ కొంత‌మందితో క‌లిసి భాంగ్రా నృత్యం చేశారు. ఫుల్ జోష్ తో చేసిన ఆయ‌న డ్యాన్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.  

Read: ద‌లాల్ స్ట్రీట్‌లో బుల్ ర‌న్‌…

Exit mobile version