NTV Telugu Site icon

తండ్రి భౌతికకాయం వద్ద … పునీత్ కూతుళ్ళు కన్నీళ్ళు

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌ కుమార్ ఇక లేరన్న వార్త యావత్ సినీ పరిశ్రమను కుదిపేసింది. ఇక పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యుల బాధ అయితే వర్ణనాతీతం. పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు వివిధ భాషలకు చెందిన సినీ ప్రముఖులు. తండ్రి పార్థివ దేహం చూసిన కూతురు ధృతీ రాజ్ కుమార్ శోకసంద్రంలో మునిగిపోయింది.

ఆ చిన్నారికి కన్నీళ్ళు ఆగడంలేదు. గుండెల నిండా తండ్రి గురుతులు కదలాడుతుంటే.. తండ్రి ఇక రాడన్న వాస్తవం జీర్ణించుకోలేకపోయింది. ప్రపంచంలో ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదని అక్కడికి వచ్చిన వారు ఆవేదన వ్యక్తం చేశారు. అతి చిన్నవయసులో పునీత్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆయన కుటుంబం తల్లడిల్లిపోతోంది. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.