Site icon NTV Telugu

గోవా లిబరేషన్‌ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ

గోవా లిబరేషన్ డే వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. గోవాలోని డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో లిబరేషన్ వేడుకలు ఘనంగా జరిగాయి. భారత దేశానికి 1947లో స్వాత్రంత్యం వచ్చినా… గోవా, డామన్ అండ్ డాయ్యు ప్రాంతాలు పోర్చుగీస్ ఆధీనంలోనే ఉండేవి. వాళ్ల నుంచి ఆయా ప్రాంతాలను విముక్తి చేయడం కోసం సుదీర్ఘ పోరాటం జరిగింది.

చివరికి 1961లో భారత సైన్యం ఆపరేషన్ విజయ్ చేపట్టి పోర్చుగీస్ నుంచి విముక్తి చేశారు. అప్పటి నుంచి ఏటా గోవా లిబరేషన్‌ వేడుకలు జరుపుకుంటున్నారు ఆ రాష్ట్ర ప్రజలు. 1961లో ఆప‌రేష‌న్ విజ‌య్‌లో పాల్గొన్నవారిని ప్రధాని మోదీ స‌త్కరించారు. ఆపరేషన్ విజయ్ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

Exit mobile version