Site icon NTV Telugu

పాలెం ఎయిర్‌పోర్ట్‌కు ప్ర‌ధాని మోడీ… ఆర్మీ అధికారుల‌కు నివాళులు…

త‌మిళ‌నాడులోని స‌ల్లూరు ఎయిర్ బేస్ నుంచి బిపిన్ రావ‌త్, ఆయ‌న భార్య మ‌ధులిక‌, 11 మంది ఆర్మీ అధికారుల పార్థీవ దేహాల‌ను ఆర్మీ ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీలోని పాలెం ఎయిర్ పోర్ట్‌కు త‌ర‌లించారు.  ఎయిర్ పోర్ట్‌లో ఆర్మీ అధికారుల పార్ధీవ దేహాల‌కు త్రివిధ ద‌ళాలు నివాళులు ఆర్పించ‌నున్నాయి.  8:33 గంట‌ల‌కు ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ నివాళులు ఆర్పిస్తారు.  ఆ త‌రువాత 8:36 గంట‌ల‌కు ఆర్మీ అధికారులు, 8:39 గంట‌ల‌కు నేవీ అధికారులు నివాళులు అర్పిస్తారు.  అనంత‌రం 8:45 గంట‌ల‌కు అజిత్ దోవల్‌, 8:50 గంట‌ల‌కు ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులు ఆర్పించ‌నున్నారు.  

Read: డీజీసీఏ కీల‌క నిర్ణ‌యం: అంత‌ర్జాతీయ విమానాలు ర‌ద్దు…

అనంత‌రం రాత్రి 9:05 గంట‌ల‌కు ప్ర‌ధాని మోడీ ఆర్మీ అధికారుల పార్థీవ దేహాల‌కు నివాళులు ఆర్పిస్తారు.  రాత్రి 9:15 గంట‌ల‌కు రాష్ట్ర‌ప‌తి నివాళులు అర్పిస్తారు.  త‌మిళ‌నాడులోని నీల‌గిరి జిల్లా కూనూరు వ‌ద్ద ఆర్మీ హెలికాప్ట‌ర్ కూలిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో బిపిన్ రావ‌త్, ఆయ‌న భార్య మ‌ధులిక‌, 11 మంది ఆర్మీ అధికారులు మృతి చెందారు. ఆ ఘ‌ట‌న యావ‌త్ భార‌తదేశాన్ని కంట‌త‌డిపెట్టించింది.

Exit mobile version