Site icon NTV Telugu

కాంగ్రెస్‌ లేకుండానే కూటమి ఏర్పాటు చేస్తాం-పీకే

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ .. కాంగ్రెస్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీ వ్యతిరేక ప్రతిపక్ష కూటమి.. కాంగ్రెస్ లేకపోయినా ఏర్పాటు చేయవచ్చని కామెంట్ చేశారు. 1984 తర్వాత కాంగ్రెస్ ఒంటరిగా గెలవలేదని .. గత పదేళ్లల్లో కాంగ్రెస్ 90 శాతం వైఫల్యాల్నే చూసిందన్నారు ప్రశాంత్ కిషోర్.

గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి పార్టీ అధ్యక్షుడైతేనే కాంగ్రెస్ పరిస్తితిలో మార్పు వస్తుందని వ్యాఖ్యానించారు . 2019 ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్‌ కనీస పోటీ ఇవ్వలేకపోయిందని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌.. ఫుల్‌ టైమ్‌ అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సూచించారు పీకే.

Exit mobile version