Site icon NTV Telugu

రికార్డు సృష్టించిన ‘రాధేశ్యామ్’ ట్రైలర్

radhe shyam

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. 24 గంటల్లో ఎక్కువ వ్యూస్ వచ్చిన టాలీవుడ్, సౌత్ ఇండియా సినిమా ట్రైలర్‌గా రాధేశ్యామ్ ట్రైలర్ ఘనత సాధించింది. 24 గంటల్లో తెలుగులో రాధేశ్యామ్‌ ట్రైలర్‌కు 23.2 మిలియన్ల వ్యూస్ రాగా రెండో స్థానంలో ఉన్న బాహుబలి-ది కంక్లూజన్‌ ట్రైలర్‌కు 21.81 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

మరోవైపు రాధేశ్యామ్ ట్రైలర్‌కు యూట్యూబ్‌లో వచ్చిన లైక్స్ చూస్తే… ఓవరాల్‌గా 5.9 లక్షల లైకులతో నాలుగో స్థానంలో నిలిచింది. కాగా అన్ని భాషల్లో రాధేశ్యామ్ ట్రైలర్‌కు 57.52 మిలియన్ల వ్యూస్, 1.43 మిలియన్ల లైక్స్ వచ్చాయి. అయితే ఎంతో ఆసక్తి రేకెత్తించిన ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్‌కు 24 గంటల్లో 51.12 మిలియన్ల వ్యూస్ వస్తే.. రాధే శ్యామ్‌కు 57.52 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం.

Exit mobile version