NTV Telugu Site icon

Prabhas Japan Fans : జపాన్‌లో ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు.. వామ్మో పూజలు కూడా..

Prabhash

Prabhash

పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు నేడు. బాహుబలి సినిమాతో ఇండియాలోనే కాక విదేశాల్లో కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు ప్రభాస్.. దాంతో ఆయన సినిమాలు మళ్లీ ఎప్పుడూ విడుదల అవుతాయో అంటూ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు… ఇక బాహుబలి తర్వాత వచ్చిన సాహో సినిమాతో ముఖ్యంగా జపాన్ లో ప్రభాస్ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించాడు. నేడు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఇప్పటికే అభిమానులు, పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

ఇక ప్రభాస్ ఫ్యాన్స్ రకరకాల కార్యక్రమాలతో పుట్టినరోజు వేడుకను ఘనంగా చేశారు.. చూస్తుంటే ఒక పండగ వాతావరణంలాగా కనిపిస్తుంది.. ఇండియన్ అభిమానులని మించిపోయి మరీ జపాన్ అభిమానులు ప్రభాస్ పుట్టిన రోజుని సెలబ్రేట్ చేస్తున్నారు. జపాన్ లో పలువురు ప్రభాస్ అభిమానులు ఆయన పుట్టిన రోజుని పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు.. ఒక దేవుడికి మనం ఎలా పూజలు చేస్తామో అలా వాళ్లు పూజలు చెయ్యడం విశేషం..

ఆయన పుట్టిన రోజు కోసం ప్రభాస్ కటౌట్స్ పెట్టి, ప్రభాస్ బొమ్మలు పెట్టి, వాటికి పూల దండలు వేసి, బర్త్ డే డెకరేషన్స్ చేసి మన తెలుగు ప్రసాదాలు పులిహార, కేసరి, గారెలు లాంటివి వండి దేవుడికి పెట్టినట్టు నైవేద్యం పెట్టి మరీ గ్రాండ్ గా వేడుకలు చేసుకున్నారు. అందరూ కలిసి సహపంక్తి భోజనాలు కూడా అచేస్తున్నారు. ఇందులో ఎక్కువగా మహిళా అభిమానులు ఉండటం విశేషం. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. మన అభిమానుల కన్నా ఎక్కువగా అభిమానం చూపించడంలో ఈ జపాన్ వాళ్ళు మనల్ని మించిపోయారుగా అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ప్రభాస్ పుట్టిన రోజు ఇక్కడ ఇండియాలోనే కాక ప్రపంచమంతా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.. మొత్తానికి ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇక సినిమాల విషయానికొస్తే .. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు..

Show comments