NTV Telugu Site icon

హరీష్ శంకర్ కు పూజాహెగ్డే “స్వీట్” సర్ప్రైజ్

Pooja Hegde Sweet Gesture to Harish Shankar

బుట్టబొమ్మ పూజాహెగ్డే తన అభిమాన చిత్రనిర్మాతలకు “స్వీట్” సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ బ్యూటీ తన స్వస్థలమైన మంగుళూరు నుంచి తెప్పించిన రుచికరమైన మామిడిపండ్లను చిత్ర పరిశ్రమ ప్రముఖులకు పంపుతోంది. ఇప్పటికే ఈ మామిడి పండ్లను త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, మరికొంత మంది ప్రముఖులకు పంపినట్లు తెలిసింది. తాజాగా హరీష్ శంకర్ ఈ విషయాన్నీ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “ఈ స్వీట్ గెస్చర్ కు ధన్యవాదాలు” అంటూ పూజాహెగ్డే చేసిన పంపిన మామిడిపండ్లతో పాటు మెసేజ్ ను కూడా షేర్ చేసుకున్నారు. అందులో పూజ “హలో సర్! నా స్నేహితుడి పొలంలో పండించిన ఈ రుచికరమైన, సేంద్రీయ మామిడి పండ్లను ఆనందిస్తారని ఆశిస్తున్నాను. అంతా బాగానే ఉందని ఆశిస్తున్నాను. త్వరలో కలుద్దాం!! లవ్, పూజా హెగ్డే” అంటూ రాసుకొచ్చింది. ఇక హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన “గద్దలకొండ గణేష్” చిత్రంలో పూజాహెగ్డే ఓ కీలకపాత్రలో కన్పించిన విషయం తెలిసిందే. కాగా హరీష్ శంకర్ త్వరలో పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించనున్నారు. మరోవైపు పూజా త్వరలో “రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌” చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇంకా ఆమె ‘ఆచార్య’లో కూడా కీలక పాత్ర పోషిస్తోంది.