NTV Telugu Site icon

RRR: విశ్వ వేదికపై ఇండియన్ సినిమాకి గొప్ప గౌరవం- ప్రముఖుల ప్రశంసలు

1

1

దేశవ్యాప్తంగా ఇప్పుడు నాటు నాటు పాట గురించే చర్చ. భారతీయ సిసినిమా అందులోనూ తెలుగు పాటకు ఆస్కార్ అవార్డ్ దక్కడం సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఈ పాటకు ఆస్కార్ అవార్డు లభించిడం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాయతీ వేదికపై తెలుగు పాటకు గౌవరం దక్కడం సంతోషంగా ఉందని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ యూనిట్‌కు అభినందనలు తెలిపారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకోవడం అభినందనీయం అని ఆయన అన్నారు. చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.

Also Read:Naatu Naatu: ‘నాటు నాటు’కు ఆస్కార్.. కేసీఆర్‌ హర్షం..

తెలుగు సినిమాకు తొలి ఆస్కార్ అవార్డును అందించిన RRR చిత్ర యూనిట్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలుగు సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట..‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ అందుకోవడం తెలుగువారందరికీ గర్వకారణం అని పేర్కొన్నారు. తెలుగు వెండితెర ఇలాంటి మరిన్ని అద్భుతమైన చిత్రాలతో అంతర్జాతీయ ఖ్యాతిని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఆకాంక్షించారు. విశ్వ వేదికపై భారతీయ సినిమాకి దక్కిన మరో గొప్ప గౌరవం అని చెప్పారు.

ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు దక్కించుకున్న “నాటు నాటు.. పాట రచయిత చంద్రబోస్, సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అభినందలు తెలిపారు. గాయకులు రాహుల్ సింప్లిగంజ్ , చిత్ర దర్శకులు రాజమౌళి, నటులు ఎన్టీఆర్, రాంచరన్, నిర్మాత డి వి వి దానయ్య, ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రయూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఇది తెలుగు, భారత సినిమాకు దక్కిన గౌరవం అని, ఎంతోమందికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

భారతదేశం గర్వించే చరిత్రాత్మక క్షణాలివి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అందరి నమ్మకాలను నిజం చేస్తూ ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘నాటు నాటు’ ఆస్కార్‌ను సొంతం చేసుకుందని సంతోషం వ్యక్తం చేశారు. ఇంతటి గొప్ప పురస్కారాన్ని అందుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ మొత్తానికి నా అభినందనలు అంటూ లోకేశ్‌ ట్వీట్ చేశారు.
Also Read:Naatu Naatu Song: అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన “నాటు నాటు…”!

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ రావడం తెలుగు చిత్ర పరిశ్రమకు, భారతీయ చిత్ర పరిశ్రమకు గర్వకారణమని ఆయన అన్నారు.నాటు నాటు పాట రచయిత చంద్రబోస్, పాటపాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, సంగీతం అందించిన ఎంఎం కీరవాణి, చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు శుభాకాంక్షలు. ఇదే స్ఫూర్తితో ఇంకా మంచి చిత్రాలను నిర్మిస్తూ తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచస్థాయిలో నిలబెట్టాలని ఆయన సూచించారు.

Show comments