Site icon NTV Telugu

కోవిడ్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క స‌మీక్ష‌…

దేశంలో కోవిడ్‌, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌ధాని మోడీ స‌మీక్ష‌ను నిర్వ‌హించారు.  కోవిడ్ క‌ట్ట‌డికి రాష్ట్రాలు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేశారు.  కోవిడ్ మందులు, ఆక్సీజ‌న్ సిలీండ‌ర్లు, కాన్స‌న్‌ట్రేట‌ర్లు అందుబాటులో ఉంచాల‌ని అన్నారు.  పీఎస్ఏ ప్లాంట్స్‌, ఐసీయూ బెడ్స్ సిద్ధంగా ఉంచాల‌ని అన్నారు.  క‌రోనా వ్యాక్సిన్‌ను వేగ‌వంతం చేయాల‌ని తెలిపారు.  కోవిడ్‌పై యుద్ధం ముగియ‌లేద‌ని, ఇంకా పోరాటం చేయాల‌ని అన్నారు.  వైర‌స్ నియంత్ర‌ణ‌కు కేంద్రం, రాష్ట్రాలు క‌లిసి ప‌నిచేయాల‌ని తెలిపారు.  జిల్లాస్థాయిలో ప్ర‌త్యేక వార్ రూమ్‌లు ఏర్పాటు చేయాల‌ని అన్నారు.  దేశంలో మొత్తం కేసులు ఇప్ప‌టి వ‌ర‌కు 361కి చేర‌డంతో ప్ర‌ధాని మోడీ అత్య‌వ‌స‌రంగా ఒమిక్రాన్‌పై స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు.  

Read: దేశంలో 5 రాష్ట్రాల ఎన్నిక‌లు… ఢిల్లీలో ప్ర‌చారం పోస్ట‌ర్లు…

Exit mobile version