ఈనెల 15న ప్రధాని మోదీ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భగవాన్ బిర్సాముండా జ్ఞాపకార్థం జంబూరి మైదాన్‌లో నిర్వహించే జన్ జాతీయ గౌరవ దివస్‌లో మోదీ పాల్గొంటారు. భోపాల్‌లో ప్రధాని మోదీ కేవలం నాలుగు గంటలు మాత్రమే గడపనున్నారు. దీని కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా రూ.23 కోట్లను ఖర్చు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజనులను ఈ సభకు తరలించేందుకు ప్రభుత్వం రూ.13 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ
కాగా మధ్యప్రదేశ్ పర్యటనలో ప్రధాని మోదీ హబీబ్ గంజ్ రైల్వేస్టేషన్‌ను జాతికి అంకితం చేయనున్నారు. ఈ స్టేషన్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ రైల్వే స్టేషన్‌ను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ.450 కోట్ల వ్యయంతో నిర్మించారు. దేశంలో ఇలా నిర్మించిన తొలి రైల్వేస్టేషన్ ఇదే. మోదీ ప్రభుత్వం కొన్ని ప్రైవేట్ రైళ్లను కూడా త్వరలో నడుపుకునేందుకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ప్రైవేట్ రైళ్లు నడుపుకునేందుకు రూట్లను కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఖరారు చేసింది. కాగా భోపాల్‌లో మోదీ పర్యటన సందర్భంగా పోలీసులు 144 సెక్షన్ విధించనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ఎప్పటికప్పుడు Ntv లైవ్ న్యూస్, లేటెస్ట్ వార్తలు, ఇంట్రెస్టింగ్ సమాచారం కోసం ట్విటర్ పేజీని ఫాలో అవ్వండి
