ప్రపంచంలో ఎక్కువ మంది పిజ్జాలు తింటుంటారు. ప్రతిరోజూ కోట్లాది పిజ్జాలను ప్రజలు ఆర్డర్ చేస్తుంటారు. భూమి మీద ఎలా ఉన్నా, అంతరిక్షంలోని స్పేస్ స్టేషన్లో ఉండే వ్యోమగాములు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే, అక్కడ వారు వీలైనంత తక్కువగా ఆహారం తీసుకోవాలి. భారరహిత స్థితిలో ఉంటారు. పైగా అరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. వీటన్నింటిని పక్కన పెట్టి భూమిపై ఉంటే ఎలాగైతే పార్టీ చేసుకుంటారో అదే విధంగా అంతరిక్ష కేంద్రంలో కూడా పిజ్జా పార్టీ చేసుకున్నారు వ్యోమగాములు. మొత్తం 6మంది వ్యోమగాములు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌లో ఉన్నారు. ఆరుగురు కలిసి వేడి వేడిగా పిజ్జాలను తయారు చేసుకొని రుచి చూశారు. ఈ తతంగాన్ని వీడియోగా తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read: తాలిబన్ నేతలను ఇంటర్వ్యూ చేసిన ఆ మహిళా న్యూస్ యాంకర్ ఏమైంది?
