Site icon NTV Telugu

జీఎస్టీ మోసానికి తెరలేపిన పీయూష్‌.. ఇంట్లో 150 కోట్లు లభ్యం..

ఆదాయం పన్ను నుంచి తప్పించుకునేందు కొంతమంది తప్పుడు దారులను అన్వేషిస్తున్నారు. తీరా అధికారుల సోదాల అసలు విషయం బయట పడడంతో జైలు పాలవుతున్నారు. అలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. యూపీ సమాజ్‌వాదీ పార్టీ నేత, వ్యాపారి పీయూష్‌ జైన్‌ తన వ్యాపారంలో వచ్చిన ఆదాయంపై పన్ను ఎగ్గొట్టేందుకు నకిలీ ఇన్‌వాయిస్‌లు, ఈ-వే బిల్లులు సృష్టించాడు. అంతేకాకుండా వాటిని ఉపయోగించి అధికారులను బురిడి కూడా కొట్టించారు.

ఆ తరువాత అనుమానం వచ్చిన అధికారులు తనిఖీలు చేయగా అసలు విషయం బయటపడింది. తప్పుడు బిల్లులతో భారీగా జీఎస్టీ, ఆదాయపన్ను ఎగవేశాడని గుర్తించిన జీఎస్టీ అధికారులు కాన్పూర్‌లోని పీయూష్‌ ఇంట్లో సోదాలు నిర్వహించారు. దీంతో వ్యాపారి పీయూష్‌ ఇంట్లోని రెండు బీరువాలలో రూ.150 కోట్ల నగదు లభ్యమైంది. ఈ మేరకు దొరికన నగదును పంచానామా నిర్వహించి జీఎస్టీ అధికారులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

https://ntvtelugu.com/the-identical-twins-got-a-government-job/
Exit mobile version