స్వేచ్ఛగా తిరిగే పావురం అక్కడ బందీగా మారింది. ఎందుకంటే ఆ పావురం కాలికి వున్న ట్యాగ్. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో పావురాలు కలకలం రేపుతున్నాయి. తిరుపతి ఆటో నగర్ లో పావురం అందరినీ హడలెత్తించింది. పావురానికి కాలికి ట్యాగ్ ను గుర్తించారు స్థానికులు. అది ఎక్కడినుంచి ఎగురుకుంటూ వచ్చిందోనని అంతా ఆందోళనకు గురయ్యారు.
అనంతరం పరిశీలనలో తమిళనాడు నుండి వచ్చిన రేస్ పావురంగా గుర్తించారు. ఈమధ్యకాలంలో తిరుపతిలో ఇలాంటి పావురాలు అనేకం కనిపిస్తున్నాయి. తిరుపతిలో రెండురోజుల క్రితం ఓ పావురం ట్యాగ్‌తో కనిపించింది. పాకాల మండలం వెంకట్రామాపురంలో పావురం కాలికి ట్యాగ్‌తో గ్రామస్థులకు కనిపించింది. అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు. ట్యాగ్ పై సెల్ నెంబర్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు పోలీసులు. తమిళనాడులోని వేలూరులో పావురాల పందెం నుంచి వచ్చినట్లు గుర్తించారు.
సూట్ కేస్ కలకలం
ఇదిలా వుంటే.. తిరుపతి ఆర్టీసీ బస్టాండులో సూట్ కేస్ కలకలం రేపింది. శ్రీకాళహస్తి ప్లాట్ ఫాం నెంబర్లు 10, 11 మధ్య పిల్లర్ పై ఒక సూట్ కేస్ గుర్తించారు. గుర్తు తెలియని వ్వక్తులు దీనిని అక్కడ ఒక స్తంభానికి ట్యాగ్ చేశారు. డాగ్ స్వ్కాడ్ సింబా ఆధ్వర్యంలో సూట్ కేసు తనిఖీ చేశారు. అయితే, సూట్ కేసులో ఏమీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు.