Site icon NTV Telugu

ఆరని పెట్రో మంట.. ఈరోజు వడ్డింపు ఇలా.. ధరలు ఎక్కడ ఎలా అంటే..?

ప్రతీ రోజు పెట్రోల్‌, డీజిల్‌పై వడ్డిస్తూనే ఉన్నాయి చమురు సంస్థలు.. వరుసగా పెరిగిపోతున్న పెట్రో ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనికరించడంలేదు.. చమురు ధరలు ప్రత్యక్షంగా కొన్ని రంగాలపై, పరోక్షంగా అన్ని రంగాలపై ప్రభావం చూపుతూ.. సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి.. రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ పైపైకి కదులున్న పెట్రో ధరలు.. ఇవాళ కూడా పెరిగాయి.. లీటర్‌ పెట్రోల్‌పై 35 పైసలు, లీటర్‌ డీజిల్‌పై 38 పైసలు వడ్డించాయి..

తాజా పెంపుతో దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.108.29, లీటర్‌ డీజిల్‌ ధర రూ.97.02కు చేరింది.. ఇక ఆర్థికరాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.114.14, లీటర్‌ డీజిల్‌ ధర రూ.105.12కు చేరింది. చెన్నైలో పెట్రోల్‌ రూ.105.13, డీజిల్‌ రూ.101.25గా ఉండగా.. కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.108.78, డీజిల్‌ రూ.100.14కు చేరాయి. ఇక, తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.112.63కి చేరితే.. డీజిల్‌ రూ.105.84గా పలుకుతోంది.. విజయవాడలో అయితే.. లీటర్‌ పెట్రోల్‌ ధర ఏకంగా రూ.114.40గా ఉండగా.. లీటర్‌ డీజిల్‌ ధర రూ.106.99కు పెరిగింది.

Exit mobile version