Site icon NTV Telugu

తగ్గేదే లే.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశవ్యాప్తంగా చమురు ధరలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరడంతో పెట్రోల్ బంకు వైపు వెళ్లాలంటే సామాన్య ప్రజలు వణికిపోతున్నారు. బుధవారం (నవంబర్ 3) కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోల్ ధర 37 పైసలు పెరిగి రూ.114.49గా ఉంది. లీటరు డీజిల్ ధర 40 పైసలు పెరిగి రూ.107.40కి చేరింది. మరోవైపు ఏపీలోని విజయవాడలో లీటరు పెట్రోల్ ధర రూ.116.61గా, లీటరు డీజిల్ ధర రూ.108.89గా నమోదయ్యాయి. విశాఖపట్నంలో లీటరు పెట్రోల్ ధర రూ.115.15గా ఉండగా లీటరు డీజిల్ ధర రూ.107.48గా పలుకుతోంది.

Read Also: దీపావళి వేళ ప్రజలకు ఊరట… తగ్గిన వంటనూనెల ధరలు

అటు దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.110.04గా, డీజిల్ రూ.98.42గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.115.85గా, డీజిల్ ధర రూ.106.62గా నమోదైంది. కాగా అంతర్జాతీయంగా ముడిచమురు బ్యారెల్ ధర నవంబర్ 3 నాటి ధరల ప్రకారం 82.73 డాలర్లుగా ఉంది. ముడిచమురు ధర పెరుగుతూ పోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా క్రమంగా పెరుగుతూ వెళ్తున్నాయి. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై పన్నులను తగ్గిస్తే సామాన్యులకు ఊరట కలుగుతుంది. కానీ ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేయకపోవడంతో సామాన్య ప్రజల జేబులకు చిల్లు పడుతోంది.

Exit mobile version