పెట్రో ధరల స్పీడ్ చూస్తుంటే ఇప్పట్లో బ్రేక్‌లు పడేలా లేవు.. ప్రతీ రోజు పెరుగుతూ.. కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇక, ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 35 పైసల చొప్పున వడ్డించాయి చమురు సంస్థలు.. తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.64కు పెరగగా… డీజిల్ ధర 97.37కు ఎగబాకింది.. ఇక, ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర రూ.114.47కు, డీజిల్ ధర రూ.105.49కు ఎగిసాయి.. కోల్‌కతాలో పెట్రోల్, డీజిల్ ధర వరుసగా రూ.109.02, రూ.100.49 చేరుకున్నాయి.
Read Also: ఈసీకి బీజేపీ ఫిర్యాదు.. అంబులెన్స్‌ల ద్వారా డబ్బులు పంపిణీ..!
మరోవైపు చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.43కి, లీటర్ డీజిల్ ధర రూ.101.59గా ఉన్నాయి. ఇక, హైదరాబాద్ విషయానికి వస్తే.. పెట్రోల్‌పై 37 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెరిగింది.. దీంతో.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.113కు చేరితే.. డీజిల్ ధర రూ.106.22గా పలుకుతోంది.
