Site icon NTV Telugu

ఎల్లుండి మంగ‌ళ‌గిరిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ దీక్ష‌…

విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని ప్రైవేట్ ప‌రం చేసేందుకు కేంద్రం ఇప్ప‌టికే సిద్ద‌మైంది.  దీనిపై అటు కేంద్ర‌కేబినెట్ నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.  విశాఖ ఉక్కును ఎప్పుడైతే ప్రైవేట్ ప‌రం చేయ‌బోతున్నార‌నే వార్త‌లు వ‌చ్చాయో అప్ప‌టి నుంచే ఉక్కుకార్మికులు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు, దీక్ష‌లు, పోరాటాలు చేస్తున్నాయి.  అయిన‌ప్ప‌టికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పంద‌న రాలేదు.  రాష్ట్రంలో అధికార పార్టీ, ప్ర‌తిప‌క్ష టీడీపీ, ఇత‌ర పార్టీలు కార్మికుల‌కు మ‌ద్ద‌తు తెలిపారు.  

Read: వావ్‌: రెండే నిమిషాల్లో విప్పేసి… మ‌ళ్లీ బిగించారు…

విశాఖ ఉక్కును ప్రైవేట్ ప‌రం చేస్తే ఊరుకునేది లేద‌ని జ‌న‌సేప పార్టీ సైతం గ‌తంలోనే పేర్కొన్న‌ది.  కార్మికుల‌కు మ‌ద్ద‌తు తెలిపింది.  కాగా, ఇప్పుడు విశాఖ ఉక్కు ప‌రిర‌క్ష‌ణ కోసం జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ దీక్ష చేయ‌బోతున్నారు.  ఎల్లుండి మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ దీక్ష చేయ‌బోతున్నారు.  ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటుగా పీఏసీ స‌భ్యులు, జిల్లాల పార్టీ నేత‌లు దీక్ష చేయ‌బోతున్నారు.  మ‌రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ దీక్ష‌పై బీజేపీ, అధికార వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

Exit mobile version