ప్రకృతి వైపరీత్యాలు, మతి తప్పిన పాలకుల దాష్టీకాల నుంచి ప్రజలు భయటపడాలని… దీపావళి పండుగ సందర్భాన ఆ ఆదిశక్తిని ప్రార్థిస్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పిన పవన్…. దీపం పరబ్రహ్మ స్వరూపమని… అంధకారం నుంచి వెలుగు వైపు నడిపించేది దీపం అని భావిస్తామన్నారు. అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్ఠాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకొనే ఈ పండుగ తరుణాన అని తెలిపారు.
తన పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు పవన్. పర్యావరణానికి నష్టం కలిగించకుండా ఈ దీపాల పండుగను జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నానని.. కాంతులను వెదజల్లే దీపాలు, విద్యుల్లతలతో ఇళ్లను అలంకరించుకుందామని పేర్కొన్నారు. ఎక్కువ హానికరం కానీ మందుగుండు సామగ్రితో దీపావళిని జరుపుకోవడం సర్వదా శ్రేయస్కరమని.. కంటికి హాని చేసే క్రాకర్లకు దూరంగా ఉందామన్నారు. ముఖ్యంగా పిల్లలను దూరంగా ఉంచాలని… ఈ దీపావళిని ఆనందకేళిగా మలచుకోమని హృదయపూర్వకంగా కోరుతున్నానని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్.
