ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పరిపాలన మొదలైంది. ఈరోజు నుంచి ఆ దేశంలో తాలిబన్ల పరిపాలన మొదలైంది. అయితే, ఆఫ్ఘనిస్తాన్ మొత్తం వారి ఆధీనంలోకి వెళ్లినప్పటికీ, పంజ్‌షీర్ ప్రావిన్స్ మాత్రం వారికి దక్కలేదు. ఆ ప్రాంతం కోసం పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నారు. అయితే, తాలిబన్లను పంజ్‌షీర్ దళాలు ఎదుర్కొంటున్నాయి. పంజ్‌షీర్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నామని తాలిబన్లు చెబుతూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. దీనిపై పంజ్‌షీర్ నేతలు స్పందిచారు. పంజ్‌షీర్ తమ ఆధీనంలోనే ఉందని, పరిస్థితులు కఠినంగా ఉన్నాయనీ, అయినప్పటికీ పోరాటం చేస్తామని పంజ్‌షీర్ నేతలు చెబుతున్నారు. పంజ్‌షీర్ దళం చేతితో అనేక మంది తాలిబన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. 1994 నుంచి ఈ ప్రాంతాన్ని దక్కించుకోవడానికి తాలిబన్లు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ వారికి సాధ్యం కావడంలేదు.
మా ఆధీనంలోనే ఉంది… వారివి బూటకపు మాటలే…!!
