ఏపీని మరో ఆఫ్ఘన్ చేశారు.. అనురాధ భావోద్వేగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనతో ఏపీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా చంద్రబాబు ఈ రోజు ఏపీ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బంద్ నిర్వహిస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. అంతేకాకుండా ముఖ్య నేతలను హౌస్ అరెస్టులు చేసి, భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా టీడీపీ అధికార ప్రతినిధి పంచమూర్తి అనురాధ భావోద్వేగ వీడియో పోస్ట్ చేశారు.
ఈ వీడియో.. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక లా అండ్ అర్డర్ ఉందా చచ్చిపోయిందా అంటూ.. తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా టీడీపీ శ్రేణులకు దేవాలయం లాంటి టీడీపీ కార్యాలయంపై దాడి చేయడం చాలా బాధకరమైన విషయమన్నారు. డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న టీడీపీ కార్యాలయంపైనే దాడి చేస్తే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ను మరో ఆఫ్ఘనిస్తాన్ లా మార్చారని అనురాధ తీవ్ర స్థాయి వ్యాఖ్యలు చేశారు.
Also Read
టీడీపీ కార్యాలయంపై వైసీపీ దాడి సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ అధికార ప్రతినిధి @AnuradhaTdp #YCPTerroristsAttack pic.twitter.com/Vr6y8NzwtV
— Telugu Desam Party (@JaiTDP) October 20, 2021
తాజావార్తలు
-
Virat Kohli Chase Master: విరాట్ కోహ్లీ కొడితే అర్సిబీ గెలవాల్సిందే.. షాకింగ్ గణాంకాలు ఇవే!
-
PEDDI POWERPLAY TOUR : ‘పెద్ది’ ప్రమోషనల్ టూర్ ప్లాన్ వచ్చేసింది
-
VD Satheesan: కేరళం సీఎంగా వీడీ సతీశన్.. అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ.. పూర్తి వివరాలు
-
Karimnagar: కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీలో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడి..
-
Vivo Y60 5G: 6500mAh బ్యాటరీతో వివో Y60 5G విడుదల.. ధర, ఫీచర్స్ తెలుసుకోండి
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్‌ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!