NTV Telugu Site icon

టీమిండియాతో హై ఓల్టేజ్ మ్యాచ్… టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్థాన్

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశమంతా క్రికెట్ ఫీవర్ నెలకొని ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన పిచ్‌పైనే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది.

జట్ల వివరాలు

భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్, రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్డిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా
పాకిస్థాన్: బాబర్‌ అజామ్‌ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్‌, ఫ‌కార్‌ జమాన్, మహ్మద్ హ‌ఫీజ్‌, షోయబ్ మాలిక్‌, హరీస్ రౌఫ్, ఇమాద్‌ వసీమ్, షాదాబ్‌ ఖాన్, హ‌స‌న్‌ అలీ, షహీన్‌ షా ఆఫ్రిది, ఆసిఫ్ అలీ