NTV Telugu Site icon

హిందూ ఆలయంలో పాక్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పూజలు…

పాకిస్తాన్‌లో హిందూవులు మైనారిటీలుగా ఉన్న సంగ‌తి తెలిసిందే.  ఆ దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కొత్త‌గా ఒక్క దేవాల‌యం కూడా నిర్మించ‌లేదు.  పైగా వేలాది దేవాల‌యాల‌ను కూల్చివేశారు.  ఇక ఇదిలా ఉంటే, పాక్‌లో ఇటీవ‌లే ఓ కొత్త ఆల‌యాన్ని నిర్మించారు.  పాక్ సుప్రీంకోర్టు ప్ర‌త్యేకంగా చొరవ తీసుకొని ప్ర‌భుత్వం చేత ఆల‌యాన్ని నిర్మించింది.  ఆల‌య పున‌ర్నిర్మాణం అనంతం సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టీస్ గుల్జార్ అహ్మ‌ద్ ఆ దేవాల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.  ఆల‌యాల‌కు అండ‌గా ఉంటాన‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా తెలిపారు.

Read: న‌వంబ‌ర్ 10, బుధ‌వారం దిన‌ఫ‌లాలు 

క‌రాక్ జిల్లాలోని తేరి గ్రామంలో ప‌ర‌మ హాన్స్‌జీ మ‌హ‌రాజ్ దేవాల‌యం ఉన్న‌ది.  ప్రాచీన కాలంనాటి ఈ దేవాల‌యాన్ని కొంద‌రు దుండ‌గులు గ‌తేడాది కూల్చివేశారు.  అప్ప‌ట్లో ఈ దేవాల‌యంకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.  కాగా, సుప్రీంకోర్టు ఈ వ్య‌వ‌హారంపై సీరియ‌స్ అయ్యింది.  స్థానిక ప్ర‌భుత్వం వెంట‌నే ఆల‌యాన్ని పున‌ర్నిర్మించాలని, ఆల‌యాన్ని ధ్వంసం చేసిన వారి నుంచి ధ‌నం వ‌సూలు చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది.  సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు స్థానిక ప్ర‌భుత్వం ఆల‌య‌నాన్ని తిరిగి పున‌రుద్ద‌రించింది.  సోమ‌వారం రోజున ఆల‌యాన్ని పునఃప్రారంభించారు.  ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో పాక్ సీజే ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.