ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక అక్కడి పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఉద్యోగాలు లేక, నిధులు లేక ఆకలితో ఆఫ్ఘన్ ప్రజలు అల్లాడిపోతున్నారు. మానవతాదృక్పధంతో వివిధ దేశాలు సహాయం అందిస్తున్నాయి. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను అక్రమించుకోవడంతో తాలిబన్ల హస్తం ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే, తాలిబన్ నేత సుహైల్ షాహిన్‌తో పాక్ జర్నలిస్ట్ ఫారూఖీ జమీల్ వీడియో ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో పాక్ జర్నలిస్ట్ జమీల్ తాలిబన్ ప్రతినిధికి ప్లైయింగ్ కిస్ ఇచ్చి అందర్ని ఆశ్చర్యపరిచాడు.
Read: భారీగా పెరిగిన ప్రపంచం అప్పులు…
దానికి రిప్లైగా తాలిబన్ ప్రతినిధి సుహైల్ కూడా అభివాదం చేస్తే ప్లైయింగ్ కిస్ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ వస్తానని, తాలిబన్ ప్రభుత్వం విజయాలను కవర్ చేస్తానని చెప్పారు. దీనిపై పాక్ జర్నలిస్టులు ఫైర్ అవుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల చేతిలో వందలాది మంది జర్నలిస్టులు చంపబడ్డారని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జర్నలిస్టులు విమర్శించారు. ఊచకోతలు, హత్యలు చేసి ప్రభుత్వాన్ని, పాలనను హస్తగతం చేసుకోవడం విజయం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.