కరోనా తరువాత వివిధ దేశాలు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. పాకిస్తాన్‌లో కూడా ఈ సంక్షోభం మొదలైంది. దేశంలో నిత్యవసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పెరిగిన ధరలను తగ్గించాలని ప్రజలు ఆందోళనల చేస్తున్నారు. కాగా, పెరిగిన ఈ ధరలపై పాక్ మంత్రి అలీ అమిన్ గందపూర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిత్యవసర ధరలు పెరిగాయి కాబట్టి ప్రజలు తక్కువ తినాలని అన్నారు. ద్రవ్యోల్భణం గురించి బహిరంగ సభలో మాట్లాడిన మంత్రి ఈ విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పిల్లలను బానిసత్వం నుంచి కాపాడటానికి ప్రజలు త్యాగాలు చేయాలని కోరారు. ఇక దేశంలో నిత్యవసర ధరలు పెరుగుతుండటంపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నాయి. ఎన్నికలకు ముందు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారని, ఎప్పుడూ లేనంతగా ధరలు పెరిగిపోతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Read: దేశంలో చిన్నారులకు టీకా…